ఒకే చోట రెండుసార్లు దారి దోపిడీ

by Sridhar Babu |
ఒకే చోట రెండుసార్లు దారి దోపిడీ
X

దిశ, కూకట్​పల్లి : కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఒకే రోజు ఒకే చోట రెండు దారి దోపిడీలు చోటు చేసుకున్నాయి. జగద్గిరిగుట్టకు చెందిన మురహరిశెట్టి అంకమ్మరావు (31) బుధవారం అర్ధ రాత్రి కైత్లాపూర్​ నుంచి కేపీహెచ్​బీ కాలనీ బ్రాండ్​ ఫ్యాక్టరీ వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లోదా అపార్ట్​మెంట్​ ఎదురుగా ఉన్న నిర్మాణుష్య ప్రదేశంలో కొంత మంది హిజ్రాలు ఎదురు పడి అడ్డుకున్నారు. అదే సమయంలో వెనుక నుంచి రెండు బైకులపై వచ్చిన నలుగురు తమ చేతిలో ఉన్న కత్తులను చూపించి బెదిరించి అంకమ్మరావు మెడలో ఉన్న 1.5 తులాల బంగారు గొలుసు, ఐక్యూ 12 సెల్​ ఫోన్​ను లాక్కుని వెళ్లి పోయారు.

అలాగే 12 గంటల సమయంలో...

ఆంధ్రప్రదేశ్​ ఈస్ట్​ గోదావరి జిల్లా కపిలేశ్వరం​కు చెందిన వెంకట సురేష్​(28) గత కొన్నిరోజుల క్రితం నగరానికి వచ్చి మోతీనగర్​లోని తన మిత్రుడు జగదీశ్​ వద్ద ఉంటూ నగరంలోని టూరిజం ప్లేస్​లను సందర్శిస్తున్నాడు.

ఈ క్రమంలో గురువారం రాత్రి బ్రాండ్​ ఫ్యాక్టరీ నుంచి నాలుగవ ఫేజ్​ రోడ్డులో వారు ఇద్దరు తమ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లోదా అపార్ట్​మెంట్​ వద్ద రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు వారిని బెదిరించి వారి వద్ద నుంచి సెల్​ ఫోన్​ లాక్కుని అక్కడి నుంచి వెళ్లి పోయారు. రెండు కేసులలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కేపీహెచ్​బీ డీఐ రవి కుమార్​ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed