Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం, ఒకరి పరిస్థితి విషమం

by Shiva |
Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం, ఒకరి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా (Sanga Reddy District) ముంబాయి జాతీయ రహదారి (Mumbai National Highway)పై సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సదాశివపేట (Sadashivapet) మండల పరిధిలోని నిజాంపూర్ (Nizampur) సమీపంలో లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో రెండు లారీలకు చెందిన క్లీనర్లు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో లారీ క్యాబిన్‌ (Lorry Cabin)లో చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం అందజేయగా.. వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్ ఇరుక్కుపోయిన ముగ్గురిని అతి కష్టం మీద బయటకు తీశారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ప్రమాదం జరిగినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story