- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏజెంట్ చేసిన మోసానికి ఆగిన రిపోర్టర్ గుండె..
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఉంటున్న జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన రిపోర్టర్ రాజేష్ లాల్ (55) గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు. ఈ సంఘటన ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో బుధవారం నమోదయింది. పూర్తి వివరాల్లోకెళితే ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో నివాసం ఉంటున్న రిపోర్టర్ రాజేష్ లాల్ ఆయన కుమారుడు సృజన్ ని యూరప్ పంపిస్తానని ఓ ఏజెంట్ ను ఆశ్రయించాడు. ఆ ఏజెంట్ యూరప్ పంపకుండా మోసం చేసి కజకిస్తాన్ కు పంపాడు.
కుమారున్ని యూరప్ పంపించేందుకు 10 లక్షల రూపాయలను ఏజెంట్ ప్రసాద్ కు రిపోర్టర్ రాజేష్ లాల్ అందించారు. కానీ కజకిస్తాన్ కు పంపించడంతో రాజేష్ కుమారుడు సృజన్ తిరిగి ఇండియాకు వచ్చాడు. దీంతో మోసం చేసిన ఏజెంట్ ప్రసాద్ ను తిరిగి డబ్బులు ఇవ్వాలని బుధవారం రాజేష్ లాల్ అడిగాడు. ఆ ఏజెంట్ స్పందించకపోవడంతో రాజేష్ లాల్ మనస్థాపానికి గురై గుండెపోటుతో బుధవారం అకస్మాత్తుగా మృతి చెందాడు. దీంతో మృతులు రాజేష్ లాల్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు గల్ఫ్ ఏజెంట్ ప్రసాద్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.