భర్త శృంగారానికి నిరాకరించడం నేరం కాదు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-20 14:28:43.0  )
భర్త శృంగారానికి నిరాకరించడం నేరం కాదు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: భర్త శృంగారానికి నిరాకరించడం నేరం కాదని కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ వివాహ చట్టం ప్రకారం భార్యతో భర్త శారీరక సంబంధానికి నిరాకరించడం తప్పే అయినా.. ఐసీపీ సెక్షన్ 498 ఏ ప్రకారం నేరం కాదని తెలిపింది. 2019లో ఓ మహిళ భర్త ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నాడు. ఆమెతో ఫిజిల్ రిలేషన్ షిక్ నకు భర్త నిరాకరించాడు. దీంతో పెళ్లయిన 28 రోజులకే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. 2020 ఫిబ్రవరిలో ఐపీసీ సెక్షన్ 498 ఏ, వరకట్న నిరోధక చట్టం కింద భర్త, అత్తమామాలపై కేసు పెట్టింది. తన వివాహ బంధం పరిపూర్ణం కాలేదని, తన పెళ్లిని రద్దు చేయాలన కోర్టును కోరింది.

2022లో ఫ్యామిలీ కోర్టు వీరి వివాహాన్ని రద్దు చేసింది. అయినా అత్తింటి వారిపై క్రిమినల్ కేసు వాపస్ తీసుకోలేదు. దీంతో భర్త కేసును సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టను ఆశ్రయించాడు. కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న భర్త, ప్రేమ అంటే కేవలం మనసులకు సంబంధించింది మాత్రమే అని, శారీరక సంబంధం కాదని నమ్మాడు. అయితే వివాహం చేసుకున్న భార్యతో శారీరక సంబంధం నిరాకరించడం నేరమే అయినా ఐపీసీ సెక్షన్ 498 ఏ కిందకు రాదు. అందుకే భర్తపై క్రిమినల్ కేసు పెట్టడం అంటే అది ఆయనను వేధింపులకు గురి చేసినట్లే అని కోర్టు తెలిపింది. క్రిమినల్ కేసును కొట్టేస్తున్నట్లు తీర్పు చెప్పింది.

Read more: రోజుకూ అరగంట తగ్గించండి చాలు.. యాంగ్జైటీస్ దూరం అవుతాయి

భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని భార్య సూసైడ్.. ప్రతి రోజు 50 ఐ లవ్ యూ మెసేజ్‌లు.. చివరకు!

Advertisement

Next Story

Most Viewed