- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చౌటుప్పల్ ఎస్ఐపై సీపీ సీరియస్ యాక్షన్.. ఆ కేసుల వివాదంతోనే..

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల పోలీస్ డిపార్ట్ మెంట్(Police Department)లోని కొందరి అధికారులు, సిబ్బంది తీరు తరచూ వివాదస్పదంగా మారుతోంది. లంచాలు(Corruption), అక్రమ సంబంధాలు(Illegal affair), భూ కబ్జా(land grab)లతో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ జిల్లా, ఆ జిల్లా అనే తేడా లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్ మెంట్‌కు మాయని మచ్చలా మారుతున్నారు కొందరు అధికారులు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District)లోని ఓ ఎస్ఐ(SI) ఫిర్యాదు చేసిన బాధితులనే ఇబ్బందులకు గురి చేశాడని, నిందితుల దగ్గర లంచం తీసుకుని ఫోర్జరీ సంతకాల(Forgery signature)కు సహకరించాడనే అభియోగాలు రావడంతో సీపీ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాచకొండ కమిషనరేట్(Rachakonda Commissionerate) పరిధిలోని చౌటుప్పల్ ఎస్ఐ(Chautuppal SI) లక్ష్మయ్య (SI Lakshmaiah) పై బదిలీ (transfer)వేటు పడింది. అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ రాచకొండ సీపీ సుధీర్ బాబు (Rachakonda CP Sudhir Babu)ఉత్తర్వులు జారీ చేశారు. చౌటుప్పల్ మండలంలోని రెడ్డిబావి స్టేజీ వద్ద దాబాలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఓ వ్యక్తి ఇటీవల చౌటుప్పల్ ఎస్ఐ లక్ష్మయ్యకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆరోపణలు ఎదుర్కొటున్న వ్యక్తుల వద్ద లంచం తీసుకుని ఫిర్యాదు చేసిన బాధితుల పైనే కేసు పెట్టి ఇబ్బందులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధితులకు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా ఓ ఫోర్జరీ సంతకం కేసులో నిందితుడిని అరెస్ట్ చేయాలని ఏసీపీ ఆదేశించగా.. నిందితుడికి ముందస్తు సమాచారం ఇచ్చి అతడు పారిపోయేలా సహకరించారని ఎస్ఐ లక్ష్మయ్య పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పీఎస్‌కు వచ్చిన వ్యక్తుల వద్ద లంచం తీసుకున్నారని సీపీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చౌటుప్పల్ నుంచి సంస్థాన్ నారాయణ పురం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు ఇచ్చినా అక్కడ జాయిన్ కాకుండా ఇక్కడే కొనసాగారు. దీంతో శాఖపరమైన చర్యలకు దిగిన సీపీ సుధీర్ బాబు.. చౌటుప్పల్ ఎస్ఐ లక్ష్మయ్యను మల్టీజోన్-2 ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ బదిలీ వేటు వేశారు.