- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నవీన్ మర్డర్ కేసు: వారం రోజుల పోలీస్ కస్టడీకి నిందితుడు హరిహరకృష్ణ
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిందితుడు పేరాల హరిహరకృష్ణను వారం రోజుల పోలీసు కస్టడీకి రంగారెడ్డి జిల్లా కోర్టు అనుమతించింది. ఈ నేఫథ్యంలో హరిహరకృష్ణను కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించనున్నారు. తన ప్రేమకు అడ్డువస్తున్నాడని అబ్దుల్లాపూర్‌మెట్‌లో స్నేహితుడైన నవీన్‌ను హరిహరకృష్ణ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిందితుడు చర్లపల్లి జైలులో రిమాండు ఖైదీగా ఉన్నాడు.
అతడి నుంచి హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు, వాడిన వస్తువుల స్వాధీనానికి కస్టడీకి ఇవ్వాలని వనస్థలిపురం ఏసీపీ.. రంగారెడ్డిజిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పోలీసుల తరఫున అదనపు పీపీ ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపించారు. హరిహరకృష్ణను 8 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌లో కోరగా.. న్యాయస్థానం వారం రోజుల కస్టడీకి అనుమతించింది. నిందితుడి పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత.. ఆధారాలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ త్వరగా ముగిసేలా చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు.