గుడుంబా స్థావరం పై పోలీసుల దాడి..

by Sumithra |
గుడుంబా స్థావరం పై పోలీసుల దాడి..
X

దిశ, జమ్మికుంట : గుడుంబాను తయారు చేస్తుండగా ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు హుజురాబాద్ ఏసీపీ కోట వెంకటరెడ్డి తెలిపారు. జమ్మికుంట టౌన్ పోలీస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలను వెల్లడించారు. జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన దుస్స కొమురయ్య (52) అనే వ్యక్తి అదే గ్రామ శివారులోని మానేరు వాగు సమీపాన గల చెరువులో గుడుంబా తయారు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, ఐదు లీటర్ల గుడుంబా, 40 లీటర్ల బెల్లం పానకం, గుడుంబా తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు. చట్టవ్యతిరేకానికి పాల్పడితే ఎలాంటి వ్యక్తులైనా పీడియాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో టౌన్ సీఐ బరపటి రమేష్, హెడ్ కానిస్టేబుల్ మధు మల్లయ్య, కానిస్టేబుల్ సురేందర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed