- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
9 ఏళ్ల కిందటి హత్యను బట్టబయలు చేసిన ‘‘చిలుక’’ సాక్ష్యం.. నిందితులకు జీవిత ఖైదు
దిశ, వెబ్‌డెస్క్: సామాన్యంగా ఎక్కడయినా వ్యక్తులే సాక్ష్యం చెబుతారు. కానీ ఓ చోట పక్షి సాక్ష్యం చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటుచేసుకుంది. పెంపుడు జంతువులు యజమానుల పాలిట ఎంత విశ్వాసంగా ఉంటాయో.. వాటికి కాసింత ప్రేమను అందింస్తే ఎలాంటి విశ్వాసాన్ని చూపిస్తాయో ఈ ఘటనే నిదర్శనం. 2014 ఫిబ్రవరి 20న ఆగ్రాకు చెందిన విజయ్ శర్మ భార్య.. నీలమ్ శర్మ తమ ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఆ సమయంలో ఈ కేసులో కొంతమందిని అనుమానితులుగా భావించి విచారించారు. సరైన సాక్షాధారాలు దొరకకపోవడం వల్ల ఆ కేసు అలాగే పెండింగ్‌లో ఉండిపోయింది. నీలమ్ శర్మ చనిపోయినప్పటి నుంచి విజయ్ శర్మ పెంపుడు చిలక బాధగా ఉంటుంది. సరిగా తినడం లేదు. అయితే విజయ్ శర్మకు అషు అనే మేనకోడలు ఉంది. ఆమె అప్పుడప్పుడు వీరి ఇంటికి వస్తూ ఉంటుంది. ఆమె హత్య జరిగిన తరువాత ఎప్పుడు అషు వచ్చినా, చిలుక ఆమెను చూసి విపరీతంగా అరుస్తుండేది. దీంతో విజయ్ శర్మకు చిలక ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడం వల్ల నీలంను హత్య చేసిన నిందితులను చిలక చూసిందేమో అని సందేహించాడు. ఈ విషయాన్ని విజయ్ శర్మ పోలీసులకు తెలిపాడు.
పోలీసులు వెంటనే గతంలో అనుమానితులుగా ఉన్నవారితో పాటు అషును కూడా చిలకముందు నిలబెట్టారు. అప్పుడు కూడా చిలక ఆమెను చూసి విపరీతంగా అరవడం మొదలుపెట్టింది. దీంతో చిలుక సహాయంతో విజయ్ శర్మ, పోలీసులు తన కోడలే చంపిందని గ్రహించి, అషును అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిని విచారించగా ఆమె అసలు విషయాన్ని బయటపెట్టింది. డబ్బు, నగలకోసం నీలం శర్మను రోన్ని అనే వ్యక్తితో కలిసి తానే హత్య చేసినట్లుగా నిజం ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఛార్జి షీట్ తయారు చేశారు. అయితే, ఈ చార్జిషీట్లో పోలీసులు చిలక వాంగ్మూలాన్ని ప్రస్తావించలేదు. చిలకను కోర్టులో సాక్షిగా ప్రవేశపెట్టలేదు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత చిలుక చనిపోయింది. కాగా 9 ఏళ్ల తర్వాత తాజాగా ప్రస్తుతం ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం జడ్జి దోషులు ఇద్దరికీ జీవిత ఖైదు విధించారు. నీలమ్ శర్మను హత్య చేసిన నిందితులు ఆమెను, ఆమె పెంపుడు కుక్కను అనేకసార్లు పదునైన ఆయుధంతో పొడిచి.. దారుణంగా హత్య చేశారని పోస్ట్ మార్టంలో తేలింది.