పాపను వెతికిపెట్టాలంటూ రోడ్డుపై తల్లిదండ్రుల ఆందోళన

by Javid Pasha |
పాపను వెతికిపెట్టాలంటూ రోడ్డుపై తల్లిదండ్రుల ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. తమ కుమార్తె కనిపించకుండా పోయి 12 రోజులవుతున్నా ఇంతవరకు ఆచూకీ దొరకలేకపోవడంతో తల్లిదండ్రులు నిరసనకు దిగారు. పెనుకొండ అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి మంగళవారం నిరసన చేపట్టారు. పెనుకొండలో దర్గా పేటకు చెందిన చిన్నారి సఫిహ గత నెల 23న అదృశ్యమైంది. ఇంటి ముందు ఆడుకుంటూ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది.

దీంతో తమ పాప అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఆచూకీ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీంతో రోడ్డుపై నిరసనకు దిగారు. తమ పాపను వెతికి పెట్టాలని వేడుకుంటున్నారు. తమ కుమార్తె ఎక్కడ ఉందో.. ఏమైపోయిందో తమకు తెలియడం లేదని, దయచేసి తమకు అప్పగించాలని చిన్నారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed