Usain Bolt: ప్రముఖ క్రీడాకారుడికి రూ.103 కోట్లకు టోకరా!

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-20 05:29:27.0  )
Usain Bolt: ప్రముఖ క్రీడాకారుడికి రూ.103 కోట్లకు టోకరా!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ క్రీడాకారుడికి సంబంధించిన రూ.103 కోట్లు మాయమయ్యాయి. జమైకాకు చెందిన పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ ఆర్థిక మోసానికి గురయ్యాడు. పదవీ విరమణ జీవితకాల సేవింగ్స్ కింద జమైకా రాజధాని కింగ్ స్టన్‌లోని స్టాక్స్ అండ్ సెక్యురిటీస్ లిమిటెడ్ అనే పెట్టుబడుల సంస్థలో బోల్ట్ డబ్బులను మదుపు చేశాడు. కాగా 1.2కోట్ల డాలర్లు (భారత కరెన్సీలో రూ.103 కోట్లు) ఆయన కోల్పోయాడు.

తాజాగా ఆయన ఖాతాలో 12 వేల డాలర్లు(రూ.9.76 లక్షలు) మాత్రమే ఉన్నాయి. ఈ సొమ్మును సదరు కంపెనీ జమ చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తానని బోల్ట్ తరపు న్యాయవాది లింటన్ పి. గోర్డాన్ సంస్థకు వార్నింగ్ ఇచ్చాడు. కంపెనీలో జరిగిన ఆర్థిక మోసానికి సంబంధించిన విషయాలను ఆయన ఫార్చూన్ మేగజైన్ అనే పత్రికతో ఫోన్‌లో మాట్లాడారు. డబ్బు తిరిగి ఖాతాలోకి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story