మహమ్మద్ నబీ హత్యకు పాత కక్షలే కారణం

by Sridhar Babu |
మహమ్మద్ నబీ హత్యకు పాత కక్షలే కారణం
X

దిశ,ఉప్పల్ : రామంతాపూర్ లో శుక్రవారం సాయత్రం జరిగిన హత్య కేసును ఉప్పల్ పోలీస్ లు కొన్ని గంటల్లోనే ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే నిన్న హత్యకు గురైన మహమ్మద్ నబీ 2023 సంవత్సరంలో జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తిని హత్య చేశాడు. దానికి ప్రతీకారంగా జాకీర్ హుస్సేన్ తమ్ముని కొడుకు రెహమాన్ (ఏసీ మెకానిక, స్నేహితులు షోహెబ్ కద్రి (గేమ్ పాయింట్ లో క్యాషియర్), నర్సింగ్ (బైక్ మెకానిక్​) కలిసి పన్నాగం పన్ని మహమ్మద్ నబీని కిరాతకంగా కత్తులతో, బండరాళ్లతో బాలకృష్ణ నగర్ మూసీ పరీవాహక ప్రాంతాల్లో హత్య చేసి మృతదేహాన్ని పడేసి పరారయ్యారు. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది సీసీ కెమెరాల ఆధారంగా శనివారం రోజు రెహమాన్, షాహెబ్ కద్రి , నర్సింగ్ ను అంబర్పేట్ లో పట్టుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి విచారించారు. జాకీర్ హుస్సేన్ ను చంపినందుకే కక్షతో మహమ్మద్ నబీని హత్య చేశామని ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని సీఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story