- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏసీబీ వలలో నిర్మల్ మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్
దిశ, నిర్మల్ : నిర్మల్ జిల్లా మార్కెటింగ్ ఈడీగా విధులు నిర్వహిస్తున్న తంగడి పల్లి శ్రీనివాస్ ఓ దడువాయి సంఘం వారి నుంచి ఏడువేల రూపాయలు లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కుమ్మరి వెంకటేష్ దడ్వాయి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఏడీ శ్రీనివాస్ ఈ లైన్ సైన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. దీనికోసం శ్రీనివాస్ రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు.
కాగా వెంకటేష్ అభ్యర్థన మేరకు లంచం మొత్తాన్ని రూ. 7 వేలకు తగ్గించాడు. రూ.7 వేలు ఇస్తే లైసెన్స్ ఇస్తానని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం మధ్యాహ్నం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ కాలనీలో ఉంటున్న ఆయన నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామని వారు పేర్కొన్నారు.