- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Crime News కేరళ టు కరీంనగర్... మరోసారి ఎన్ఐఏ రైడ్స్ కలకలం?
దిశ ప్రతినిధి, కరీంనగర్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల మూలలు మరోసారి కరీంనగర్‌లో బయట పడ్డాయా..? పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ వేళ్లూనుకపోయిందా..? కేరళలో నిషేధం విధించిన తరువాత కరీంనగర్‌కు చేరుకుందా..? ఎన్ఐఏ సోదాలు దేనికి సంకేతం....?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వరసగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సోదాలు చేపట్టడం కలకలం సృష్టిస్తోంది. రెండు మూడు రోజుల క్రితం జగిత్యాల, కరీంనగర్‌లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో నివాసం ఉంటున్న ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకుని ఎన్ఐఏ కోర్టులో హాజరు పరిచింది. గురువారం తెల్లవారు జాము నుండి కరీంనగర్‌లో ఎనిమిది చోట్ల ఎన్ఐఏ బృందాలు సోదాలు చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వచ్చిన ఈ టీమ్స్ కొంతమంది ఇళ్లతో పాటు శివారు ప్రాంతాల్లోని షెల్టర్ జోన్లలో సోదాలు చేసినట్టుగా సమాచారం. అయితే ఎన్ఐఏ అదికారులు రైడ్స్ చేసినట్టుగా అధికారులు ఎవరూ ధృవీకరించడం లేదు. కానీ పుకార్లు మాత్రం షికార్లు చేయడంతో కరీంనగర్ అంతా అల్లకల్లోలం అయిపోయిందనే చెప్పాలి. అయితే ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వకుండా సోదాలు చేయరని కూడా పోలీసు వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించినప్పుడు స్థానికంగా ఎదురుతిరుగుతున్నందన స్థానిక పోలీసుల సహకారం లేకండా ఈ బృందాలు క్షేత్ర స్థాయి తనిఖీలకు వెళ్లే అవకాశమే లేదని అంటున్నారు.
ఇర్ఫాన్ సమాచారం... ?
అయితే కరీంనగర్ హుస్సేనీపురాలో ఇర్పాన్‌ను మూడు రోజుల క్రితం ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నుండి వచ్చిన సమాచారంతో కరీంనగర్‌లో పీఎఫ్ఐ ఆనవాళ్ల గురించి తెలుసుకున్నట్టు సమాచారం. ఇర్ఫాన్ ద్వారా వచ్చిన సమాచారంతో ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. జగిత్యాలకు చెందిన ఇర్ఫాన్ గత కొంతకాలంగా కరీంనగర్‌లోనే నివాసం ఉంటూ పీఎఫ్ఐ కార్యకలాపాలను కొనసాగించినట్టుగా ఎన్ఐఏ అధికారులు విచారణలో తేల్చినట్టుగా సమాచారం. మరికొంతమందిని పీఎఫ్ఐ సానుభూతిపరులను కూడా తయారు చేసుకున్నారని కూడా అనుమానిస్తున్నారు. కేరళలో పీఎఫ్ఐ పట్టు సాధించిన తరువాత నెమ్మదిగా కరీంనగర్ వైపు ఈ సంస్థ అడుగులు వేసినట్టుగా భావిస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తిని గుర్తించి అతన్ని కట్టడి చేసిన తర్వాత పీఎఫ్ఐ కార్యకలాపాలు లేకుండా పోయాయని పోలీసు వర్గాలు అంచనా వేశాయి. అయితే స్థానికేతరుడు వచ్చి ఇక్కడ సంస్థ నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఏజెన్సీ గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్న వ్యక్తి గురించి కూడా ఆరా తీస్తున్నట్టుగా సమాచారం.
Also Read: పాతబస్తీలో ఎన్‌ఐఏ సోదాలు.. పీఎఫ్‌ఐ కార్యాలయం సీజ్