ఓయు పోలిస్ స్టేషన్ పరిధిలో యువతి మిస్సింగ్..

by Sumithra |
ఓయు పోలిస్ స్టేషన్ పరిధిలో యువతి మిస్సింగ్..
X

దిశ, సికింద్రాబాద్ : హోమ్ లో ఉంటున్న యువతి అదృశ్యమైన ఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వరంగల్ కు చెందిన కబీర సుల్తానా ( 29 ) భరోసా కేంద్రం ద్వారా గత ఆగస్టు 25 వ తేదీన తార్నాకలోని ఒక హోమ్లో చేర్పించారు. కొద్ది రోజుల క్రితం ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన హోమ్ నిర్వాహకులు హెచ్చరించారు. హోమ్ తాళాలను తీసి, తాళం చేతులను గేటు దగ్గర పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. హోమ్ నిర్వాహకులు సాధ్యమైన ప్రదేశాలలో వెతికినప్పటికీ ఫలితం లేకపోడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story