తల్లీకూతుళ్ల మిస్సింగ్

by Shiva |   ( Updated:2023-05-27 13:31:42.0  )
తల్లీకూతుళ్ల మిస్సింగ్
X

దిశ, పెగడపల్లి : కూతురుతో సహా తల్లి అదృశ్యమైన ఘటన పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివాహిత భర్త పెంజర్ల మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య సుజాత, కూతురు వైష్ణవి శుక్రవారం రోజున ఉదయం పది గంటల ప్రాంతంలో ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లుగా గుర్తించామన్నారు. ఇద్దరి ఆచూకీ కోసం తెలిసిన వాళ్ల ఇళ్లు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు మల్లేశం తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కుమార స్వామి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed