కరెంట్ షాక్ తో వివాహిత మృతి

by Sumithra |
కరెంట్ షాక్ తో వివాహిత మృతి
X

దిశ, బోధన్ : ఇంట్లో ఉన్న సింగిల్ ఫేజ్ మోటర్ వైర్ కనెక్షన్ తొలగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చంద్రకళ(48) అనే మహిళ తన ఇంట్లో ఉన్న సింగిల్ ఫేజ్ మోటారు వైర్ కనెక్షన్ తొలగించేందుకు విద్యుత్ సరఫరా ఉన్న వైర్ ను ముట్టుకుంది. దీంతో ఒక్క సారిగా షాక్ తగిలి చంద్రకళ అక్కడిక్కడే కిందపడి మృతి చెందింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. భర్త పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పాండే రావు తెలిపారు.

Advertisement

Next Story