తాళం వేసిన ఇండ్లే వారి టార్గెట్..

by Kalyani |
తాళం వేసిన ఇండ్లే వారి టార్గెట్..
X

దిశ, జవహర్ నగర్: తాళం వేసిన ఇండ్లే టార్గెట్ చేసుకొని రాత్రి వేళలో ఇండ్లల్లో చొరబడి బంగారం ఆభరణాలను దొంగిలించిన కేసులో ఇద్దరి నిందితులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సీఐ కే సీతారాం, డీఐ మధు కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2005 నుంచి పలు నేరచరిత్ర కలిగి అక్రమ ఆస్తి, పలు నేరాలకు పాల్పడుతున్న షేక్ మస్తాన్ వలి అలియాస్ శ్రీధర్ (36)ను ఈ నెల 6 వ తేదీన భువనగిరి ఫింగర్ ప్రింట్స్ బృందం గుర్తించింది. ఇదే విషయంపై నిందితులను పట్టుకునేందుకు పోలీసులు పక్క ప్రణాళికతో ఇద్దరిని పట్టుకున్నారు.

వీరు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 నుంచి జరిగిన 8 కేసులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. షేక్ మస్తాన్ వలి అలియాస్ శ్రీధర్ కు 4 కేసులకు తోడుగా ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్న వేమూరి శ్రీనివాసులు అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శ్రీను అలియాస్ డోన్ (42) గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 6 తులాల బంగారం, 2.6 కేజీల వెండి ఆభరణాలు, 2 లాప్ టాప్ లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 5 లక్షల 50 వేలు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని బుద్వేల్ ప్రాంతానికి చెందిన షేక్ మస్తాన్ వలి అలియాస్ శ్రీధర్, ఒంగోలు జిల్లా టంగుటూరు గ్రామానికి చెందిన వేమూరి శ్రీనివాసులు ఆటో డ్రైవర్ గా పని చేస్తూ వీరిద్దరూ సికింద్రాబాద్ లోని రెజిమెంటల్ బజార్ లో నివాసం ఉంటూ పలు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి బాలాజీ నగర్ దమ్మైగూడ తదితర ప్రాంతాల్లో పగలు రెక్కీ నిర్వహించి తాళాలు ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి వేళల్లో దొంగతనాల పాల్పడుతున్నట్లు నిందితులలో ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో వీరిని సోమవారం రిమాండ్ కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed