- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతా గంటలోనే..! యువతి కిడ్నాప్‌తో తల్లిదండ్రులు ఆత్మహత్య..
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో కొంత మంది యువత ప్రేమ పేరుతో నేరాలకు పాల్పడుతున్నారు. తాను ఇష్టపడిన అమ్మాయిలు ప్రేమను అంగీకరించకపోతే వాళ్లను హత్యలు చేయడమో, లేక కిడ్నాప్‌లు చేయడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే నాసిక్‌లో జరిగింది. తన ప్రేమను ఒప్పుకోవాలని, పెళ్లి చేసుకోవాలని అమ్మాయిని ఒత్తిడి చేశాడు ఓ యువకుడు. దీనికి ఆమె ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రుల ఎదురుగానే కిడ్నాప్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
నాసిక్‌లోని ఓ నగరానికి చెందిన సాధన్ ఝంకర్ అనే యువకుడు 19 ఏళ్ల యువతిని ప్రేమించాడు. తనని కూడా ప్రేమించాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దానికి యువతి నిరాకరించడంతో ఆమెపై కోపంతో ఊగిపోయాడు. యువతిని ఎలా అయిన తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. దీంతో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో యువతి తల్లిదండ్రులతో కలిసి ద్విచక్ర వాహనంపై నాసిక్‌లోని ఘోటి-పంధుర్లి హైవేపై వెళుతున్న క్రమంలో కారులో తన స్నేహితులతో వచ్చిన సాధన్ ఆమెను కిడ్నాప్ చేశాడు. అడ్డు వచ్చిన యువతి తల్లిదండ్రులను కొట్టాడు.
దీంతో తమ కళ్ల ముందే బిడ్డను కిడ్నాప్ చేయడంతో తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు గంట వ్యవధిలో భాగూర్ నానేగావ్ రైల్వే ట్రాక్‌పై గోదాన్ ఎక్స్ ప్రెస్ కింద దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే విషయం తెలుసుకున్న యువతి మామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కిడ్నాప్, ఇంకా ఆత్మహత్య చేసుకునేలే ప్రేరేపించినందుకు సాధన్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్‌కు గురైన యువతి, నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Read More... గర్ల్ ఫ్రెండ్ను చంపడానికి కొన్ని నిమిషాల ముందు సాహిల్ ఏం చేశాడో తెలుసా?