మైనర్ బాలిక కిడ్నాప్ హత్య.. మృతదేహాన్ని ఏం చేశాడంటే?

by Anjali |
మైనర్ బాలిక కిడ్నాప్ హత్య.. మృతదేహాన్ని ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: మైనర్ బాలికని 32 ఏళ్ల ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి, హత్య చేసిన ఘటన కోల్‌కతాలో శ్రీధర్ రాయ్ రోడ్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. శ్రీధర్ రాయ్ రోడ్‌లో నివసిస్తున్న ఏడేళ్ల మైనర్ బాలిక ఉదయం కనిపించకపోవడంతో ఇంట్లో, బయట, చుట్టుపక్కల వెతికసాగారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులు తిలజాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ చిన్నారి నివసించే భవనంలోని మొత్తం 32 ఫ్లాట్లలో సోదాలు నిర్వహించారు. కానీ బాలిక ఆచూకీ లభించలేదు. పక్కనే ఉన్న భవనంలోకి ప్రవేశించడం సిసిటివిలో కనిపించిందని స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులు ఆ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు.

ఎంతగా ప్రయత్నించినా, ఆమె జాడ కనిపెట్టకపోవడంతో పోలీసుల పనితీరుపై ఇరుగుపొరుగు వారిలో ఆందోళన నెలకొంది. చాలాసేపు వెతికిన తర్వాత.. సాయంత్రం సమయంలో వారింటి పక్కనే తాళం వేసి ఉన్న సమస్తిపూర్‌కు చెందిన అలోక్‌కుమార్‌ ఇంటిని గమనించగా.. చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి, తాళం పగులగొట్టి చూడగా గోనె సంచిలో తప్పిపోయిన బాలిక మృతదేహాన్ని చూసి విస్తుపోయారు. అలోక్‌కుమార్‌ను పోలీసులు విచారించగా అతడే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఈ హత్య చేయడానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు నిందుతుడిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. బాలిక తల, చెవిపై గాయాలున్నట్లు గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. పోలీసుల నిర్లక్ష్యమే బాలిక మరణానికి కారణమని ఆరోపిస్తూ ఇరుగుపొరుగు వారు టిల్జాల పోలీస్ స్టేషన్‌ ముందు నిరసన చేశారు. జనం ఆందోళనకు దిగడంతో పోలీస్ స్టేషన్ గేటును మూసివేశారు. ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక అందుబాటులోకి వచ్చిన తర్వాత మరింత సమాచారం అందిస్తామని కోల్‌కతా సీనియర్ పోలీసు అధికారి ప్రజలకు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story