కోట్లు కొల్లగొట్టిన కిలాడీలు.. ఇద్దరి అరెస్ట్​

by Vinod kumar |
కోట్లు కొల్లగొట్టిన కిలాడీలు.. ఇద్దరి అరెస్ట్​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పెట్టుబడులపై దండిగా లాభాలు ఇస్తామని ఆశ పెట్టి రెండు వందల కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టిన గ్యాంగులోని ఇద్దరిని హైదరాబాద్​ సెంట్రల్ ​క్రైం స్టేషన్ ​అధికారులు అరెస్టు చేశారు. పోలీస్ ​కమిషనర్ ​సీ.వీ. ఆనంద్ ​పోలీస్​ కమాండ్ ​కంట్రోల్​లో శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన రియాజుద్దీన్, షకీలా, పూజా కుమారి కలిసి పర్ఫెక్ట్​ హెర్బల్​కేర్​ ప్రైవేట్​ లిమిటెడ్​ పేర కొంతకాలం క్రితం సంస్థను ప్రారంభించారు. హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో మోటివేషనల్​సెమినార్లను నిర్వహిస్తూ ఐడీ స్కీంను ప్రవేశపెట్టారు. దీంట్లో 9,999 వేల రూపాయలు పెట్టుబడిగా పెడితే 36 నెలలపాటు ప్రతీనెలా 880 రూపాయలు చెల్లిస్తామని చెప్పేవారు. దాంతోపాటు పర్ఫెక్ట్​ హెర్బల్ ​స్టోర్​ స్కీంలో 6 లక్షలు పెట్టుబడిగా పెడితే 30 నెలలపాటు ప్రతీనెలా 30వేల రూపాయలు ఇస్తామని తెలిపేవారు.

25 లక్షల రూపాయలను పర్ఫెక్ట్​ బజార్ ​స్కీంలో పెట్టుబడిగా పెడితే సూపర్ ​మార్కెట్ ​ప్రారంభించి ఇస్తామని, 36 నెలలపాటు నెలకు లక్ష రూపాయలతోపాటు అమ్మకాల్లో 3 నుంచి 5 శాతం కమీషన్​గా ఇస్తామని ప్రలోభ పెట్టేవారు. ఇలా హైదరాబాద్​లోని కాటేదాన్, శాలిబండ, దారుల్​షిఫా, మల్కాజిగిరి, సీతాఫల్​మండీ, ఢిల్లీలోని మధువిహార్, యూపీలోని మీరట్, కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతాల్లో సూపర్​మార్కెట్లు తెరిచారు కూడా. తామిచ్చిన టార్గెట్లను పూర్తి చేస్తే టూర్లతోపాటు, ల్యాప్​టాప్లు, ద్విచక్ర వాహనాలు, బంగారు నగలు, కార్లు, ఫ్లాట్లు బహుమతిగా ఇస్తామని నమ్మించేవారు.

మొదట్లో కొంతమందికి చెల్లింపులు జరపటంతో ఆశపడ్డ దాదాపు 7వేల మంది ఈ సంస్థలో 200 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టారు. ఈ వ్యవహారం గురించి తెలిసి అదనపు పోలీస్​కమిషనర్​(క్రైమ్స్) ఏ.ఆర్. శ్రీనివాస్​పర్యవేక్షణలో ఇన్స్​పెక్టర్​అప్పలనాయుడు నిందితులను పట్టుకోవటానికి రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సిబ్బందితో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఆయన రియాజుద్దీన్, పూజా కుమారిలను అరెస్టు చేశారు. ఇద్దరిని స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ ​వారెంట్​పై హైదరాబాద్ ​తీసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed