ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణం

by Shiva |
ఉరేసుకుని వ్యక్తి బలవన్మరణం
X

దిశ, మంథని : ఉరేసుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మంథని పట్టణంలోని చైతన్యపురి కాలనీలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన జంగపల్లి కనకయ్య (49) కూలి పని చేస్తూ.. జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను తాగుడుకు బానిసయ్యాడు. రోజు కూలి పని చేస్తే వచ్చే డబ్బును కేవలం తన తాగుడుకే ఖర్చు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం కనకయ్యను తన భార్య సరిత నిలదీసింది.

కష్టం చేసిన డబ్బులు అన్నీ.. తాగుడుకే తగలేస్తున్నావని, ఇద్దరు పిల్లల చదువులకు ఫీజు ఎలా కట్టాలంటూ భార్య, భర్తల మధ్య వాగ్వాగం జరిగింది. సరిత కూలీ పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చేసరికి కనకయ్య చీరతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం జరిగిన గొడవతోనే తన భర్త కనకయ్య ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని మృతుడి భార్య సరిత మంథని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed