ప్రమిదల కోసం వెళ్లి పరలోకాలకు...

by Sridhar Babu |
ప్రమిదల కోసం వెళ్లి పరలోకాలకు...
X

దిశ, మునగాల : దీపావళి కోసం పెద్ద మొత్తంలో ప్రమిదలు కొనుగోలు చేసి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయా లయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని మాధవరం గ్రామంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడ పట్టణం విద్యాధరపురంనకు చెందిన రాజారపు రాంబాబు(57), భార్య రమణ, డ్రైవర్లు రోషిబాబు, క్రాంతికుమార్ కలిసి కారులో ఈనెల 25న హైదరాబాద్ వెళ్లి అక్కడ మట్టితో చేసిన ప్రమిదలను కొనుగోలు చేసి తిరిగి విజయవాడకు వస్తున్నారు.

మధ్యలో మాధవరం వచ్చేసరికి డ్రైవర్ అతివేగంగా రోడ్డు వెంట ఉన్న గ్రిల్స్ ను ఢీకొట్టడంతో రాంబాబు అక్కడికక్కడే మృతి చెందగా భార్య రమణకు, డ్రైవర్లు రోషి బాబు, క్రాంతి కుమారుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుని కుమారుడు లోకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed