చికిత్స పొందుతూ బాలిక మృతి..

by Sumithra |
చికిత్స పొందుతూ బాలిక మృతి..
X

దిశ, తలకొండపల్లి : మండలంలోని గట్టు ఇప్పలపల్లిలో గత ఐదు రోజుల క్రితం ఊరుకొండ పెట్ గ్రామానికి చెందిన వడ్డేమోని ఐశ్వర్య (9) అనే బాలిక వరుసకు పెద్దమ్మ అయిన చంద్రకళ ఇంటికి వచ్చింది. ఈనెల 22న చంద్రకళ మల్లేష్ ఇరువురు వ్యవసాయ పని నిమిత్తం పొలం పనులకు బయటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఐశ్వర్య మ్యాగీ తయారు చేసుకోవడానికి వంటగదికి వెళ్లి సిలిండర్ ముట్టిచ్చిందని ఎస్సై వెంకటేష్ తెలిపారు. సిలిండర్ ముట్టిచ్చిన సమయంలో ఒంటి పై ఉన్న దుస్తువులు ప్రమాదవశాత్తు అంటుకోవడంతో వెంటనే పాప బయటికి వచ్చి కేకలు వేసింది.

ఇరుగుపొరుగు వారు అది గమనించి ఐశ్వర్య పెద్దమ్మ పెదనాన్నకు సమాచారం ఇచ్చారు. గాయపడ్డ ఐశ్వర్యను వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి తరలించి, అక్కడి నుండి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ఐశ్వర్య ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు సోమవారం ఉదయం ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తలకొండపల్లి ఎస్సై వెంకటేష్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story