గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు హతం

by Javid Pasha |   ( Updated:2023-04-16 06:43:40.0  )
గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు హతం
X

దిశ, వెబ్ డెస్క్: ఓ హత్య కేసులో జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో మృతి చెందారు. మెడికల్ చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా యూపీలోని ప్రయాగ్ రాజ్ వద్ద జర్నలిస్టుల్లా ఐడీ కార్డులు వేసుకొని వచ్చిన కొందరు వ్యక్తులు రివాల్వర్లతో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో వారిద్దరిని కాల్చి చంపారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడం గమనార్హం. అయితే వెంటనే స్పందించిన పోలీసులు కాల్పులకు తెగబడ్డ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ నెల 13న అతిక్ కుమారుడు అసద్ పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో హతం అయిన విషయం తెలిసిందే.

.

.

Advertisement

Next Story

Most Viewed