డీఆర్సీ సెంటర్ లో అగ్ని ప్రమాదం

by Shiva |
డీఆర్సీ సెంటర్ లో అగ్ని ప్రమాదం
X

ఆగ్నికి ఆహుతైన డీసీఎం, రెండు ఆటోలు

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డ్రై రిసోర్స్ సెంటర్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. డీఆర్సీ సెంటర్ లోని ప్లాస్టిక్ కవర్లను డీసీఎంలో లోడ్ చేస్తున్న క్రమంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో డీసీఎం, 2 బేలింగ్ మిషన్లు, 2 కన్వేయర్ బెల్టులు, రెండు కంప్యూటర్లు కాలి బుూడిదయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతుండడంతో ఫైర్ ఇంజన్ తో మంటలను అదపు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story