చికెన్ వండమన్నాడని ఇటుకలతో కొట్టిన చంపిన యువకుడు!

by GSrikanth |
చికెన్ వండమన్నాడని ఇటుకలతో కొట్టిన చంపిన యువకుడు!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: హత్య జరిగిన ఎనిమిది గంటల్లోనే పోచారం ఐటీ కారిడార్​పోలీసులు మిస్టరీని ఛేధించారు. అనంతరం నిందితున్ని అరెస్టు చేశారు. రాచకొండ కమిషనర్​డీ.ఎస్.చౌహాన్​సోమవారం ఎల్బీనగర్‌లోని క్యాంప్​కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బిహార్ రాష్ర్టానికి చెందిన ధీరజ్​మండల్​(27), సుశీల్​గోస్వామి (28) కొంతకాలం క్రితం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్‌కు వచ్చారు. జోడిమెట్ల చౌదరిగూద గ్రామపంచాయతీలోని 677, 678 సర్వే నెంబర్లలో సామల నర్సింహారెడ్డి నడుపుతున్న సిమెంట్​ఇటుకల తయారీ యూనిట్లో పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ ఇద్దరు తమతోపాటు యూనిట్లో పని చేస్తున్న బిహార్​రాష్ర్టవాసులు సుజిత్​విజయ్​గోస్వామి, బాల నిమేష్​కుమార్‌తో కలిసి ఈనెల 4న రాత్రి సమయంలో మద్యం సేవించారు. ఆ సమయంలో ధీరజ్​మండల్​చికెన్​ఫ్రైం వండమని సుశీల్​గోస్వామితో చెప్పాడు. దీనికి సుశీల్​గోస్వామి నిరాకరించటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది.

దాంతో ధీరజ్​మండల్ కోపంతో సుశీల్​గోస్వామిపై దాడికి యత్నించగా సుజిత్​విజయ్​గోస్వామి, బాల నిమేష్​కుమార్​అడ్డుకున్నారు. ఆ తరువాత అంతా నిద్రపోయారు. కాగా, అంతకు ముందు కూడా ధీరజ్​మండల్​తనపట్ల అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో కోపంగా ఉన్న సుశీల్​గోస్వామి తెల్లవారుఝాము సమయంలో నిద్రపోతున్న ధీరజ్​మండల్​తలపై రెండు సిమెంట్​ఇటుకలతో కొట్టి అతన్ని చంపాడు. ఆ తరువాత పారిపోవటానికి ఘట్ కేసర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. హత్య గురించి తెలియగానే రంగంలోకి దిగిన పోచారం ఐటీ కారిడార్​పోలీసులు అతన్ని రైల్వేస్టేషన్‌లో అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన సిమెంట్​ఇటుకలతోపాటు నిందితుని నుంచి సెల్​ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి జోన్​డీసీపీ జానకి ధరావత్​పర్యవేక్షణలో ఎనిమిది గంటల్లోనే మిస్టరీని ఛేధించి నిందితున్ని అరెస్టు చేసిన సిబ్బందిని కమిషనర్​అభినందించారు.

Advertisement

Next Story