భీమ్‌గల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

by Sumithra |
భీమ్‌గల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..
X

దిశ, భీమ్‌గల్ : అతివేగం ముగ్గురి ప్రాణాలు తీసింది. భీమ్‌గల్ శివారులోని సబ్ స్టేషన్ వద్ద మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు స్వల్ప గాయలతో బయట పడ్డారు. గాయపడిన వారిలో మహిళల, వ్యక్తితో పాటు ఇద్దరు చిన్నారులు సేఫ్ గా బయట పడ్డారు.వివరాలు ఇలా ఉన్నాయి. మోర్తాడ్ మండలానికి చెందిన వారు భీమ్‌గల్ మండలం బడా భీంగల్ ఎల్లమ్మ ఆలయం వద్దకు వెళ్లి తిరిగి ఏపీ 09 బీఈ 7661 నెంబర్ గల కారులో తిరిగి వెళుతున్నారు.

ఈ క్రమంలో భీమ్‌గల్ సబ్ స్టేషన్ వద్ద జేసీబీ ని ట్రాక్టర్ ట్రాలి పై తీసుకువస్తున్న ట్రాక్టర్ ను కార్ డీ కొట్టింది.ఈ ప్రమాదం లో ట్రాక్టర్ ఇంజిన్ తో పాటు ట్రాలీపై ఉన్న జేసీబీ కార్ పై పడింది. దాంతో కార్ లో ఉన్న ముగ్గురు వడ్ల రాజేశ్వర్,జ్యోతి ( దోన్కల్ ), గోవింద్ పేట్ కు చెందిన రమ అక్కడికక్కడే మృతి చెందారు. కార్ పైనే ట్రాక్టర్ ఇంజిన్ తో పాటు జేసీబీ మొత్తం పడి పోయాయి.కార్ పై పడిన వాటిని తీసేందుకు మరో మూడు జేసీబీ లను తెప్పించారు.జేసీబీల సహాయంతో కారులో ఇరుకున్న ఇద్దరు చిన్నారులతో పాటు మరో ఇద్దరిని రక్షించి 108 లో ఆర్మూర్ దవాఖాన కు తరలించారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు..

భీమ్‌గల్ లో జరిగిన ప్రమాదం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed