- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Drugs Seized : పండుగ ‘మత్తు’.. ఓ వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ స్వాధీనం
దిశ, శేరిలింగంపల్లి : రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకుని నగరానికి వచ్చిన వ్యక్తి తెలిసిన వారి ఇంటి వద్ద ఫ్రెష్ అప్ అయి విజయవాడకు వెళ్దామనుకున్నా క్రమంలో చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం జలోర్ జిల్లా బగోడ తాలుకాకు చెందిన కృష్ణారామ్ (28) ఓ బ్యాగ్ తీసుకుని గురువారం రాత్రి నగరానికి వచ్చాడు. అటు నుండి చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గుల్మొహర్ కాలనీలో ఉంటూ స్టీల్ వ్యాపారం చేస్తున్న తన గ్రామానికి చెందిన రూపారామ్ ఇంటికి వచ్చాడు. ఫ్రెష్ అప్ అయి వెళ్లిపోతానని చెప్పాడు. ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో రాజస్థాన్ నుండి వచ్చిన కృష్ణారామ్ ఉండేందుకు అనుమతి ఇచ్చాడు.
అయితే అతను తీసుకువచ్చిన బ్యాగ్, అతని వ్యవహార శైలి, ఇటు నుండి విజయవాడ వెళ్తున్నట్లు అతను చెప్పిన తీరుపై అనుమానం వచ్చిన రూపారామ్ అతను బాత్రూంకు వెళ్లగానే దాన్ని తనిఖీ చేశాడు. అందులో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించిన రూపారామ్ వెంటనే చందానగర్ పోలీసులకు, నార్కోటిక్ డ్రగ్స్ అధికారులకు సమాచారం అందించాడు. హుటాహుటిన గుల్మొహర్ కాలనీలోని రూపారామ్ ఇంటికి చేరుకున్న పోలీసులు నిందితుడు కృష్ణారామ్ ను అదుపులోకి తీసుకుని అతను తెచ్చిన బ్యాగు లో నుండి 155 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విలువ రూ.18 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.