- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
దిశ, తిరుమలగిరి : బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీ నగర్ కు చెందిన ఇంటర్ విద్యార్థిని మంగళవారం అదృశ్యం అయింది. బోయినపల్లి ఎస్ఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో నివాసం ఉంటున్న షేక్ నజియా, మహబూబ్ పాషా తమ కూతురు (15)ను ఉత్తమ విద్యకై విజయవాడలోని ఓ కాలేజీలో చేర్పించారు. ఆ విద్యార్థిని రహస్యంగా ఓ అబ్బాయితో ప్రేమలో పడి అతనితో తిరుగుతుందని కొద్దిరోజుల క్రితం ఆమె తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం ఫోన్ ద్వారా సమాచారం తెలిపారు. వారు హైదరాబాద్ లోని బాపూజీ నగర్ కు చెందిన తమ బంధువు ఇమ్రాన్ హుస్సేన్ కు విషయం చెప్పి ఆమెను తీసుకువచ్చి ఢిల్లీకి పంపించాలని కోరారు.
దీంతో ఆయన ఆమెను 2 రోజుల క్రితం బోయినపల్లిలోని బాపూజీనగర్ లో గల తన నివాసానికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఢిల్లీకి పంపించడానికి విమాన టికెట్ ను బుక్ చేశాడు. మధ్యాహ్నం ఎయిర్ పోర్ట్ కు వెళ్లాలని తయారు కావాలని షేక్ సమీరా కు చెప్పి మేనమామ ఇమ్రాన్ హుస్సేన్ బయటకు వెళ్లి తిరిగివచ్చాడు. ఇంటికి వచ్చి చూసిన ఆయనకు మేనకోడలు కనిపించకపోవడంతో తెలిసిన వారిని, ఇరుగుపొరుగు వారిని ఫోన్ ల ద్వారా విచారించాడు. అంతేకాకుండా ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో వెంటనే బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.