మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం..సాప్ట్ వేర్ ఉద్యోగి కుంటుంబం ఆత్మహత్య..

by Kalyani |   ( Updated:2023-03-25 15:25:44.0  )
మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం..సాప్ట్ వేర్  ఉద్యోగి కుంటుంబం ఆత్మహత్య..
X

దిశ, కాప్రా: మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి కుటుంబం శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. కుషాయిగూడలోని కందిగూడ క్రాంతి పార్కు రాయల్ అపార్ట్ మెంట్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనలో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆత్మహత్యకు పాల్పడిన వారిని సతీష్ (39), వేద (35), నిషికేత్ (9), నిహాల్ (5)లుగా గుర్తించారు. పిల్లల అనారోగ్య కారణాలతో ఈ సాప్ట్ వేర్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story