- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Cyber Crime: ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం.. రూ.16 లక్షలకు కుచ్చుటోపీ
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) తమ పంజా విసురుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు సులువుగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెగబడుతున్నారు. వాట్సాప్ (Whatsaap), ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫాంలలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నిలువునా దోచేస్తున్నారు. క్యూఆర్ కోడ్స్ (QR Codes), వెబ్ లింకు (Web Links)లతో అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. స్టాక్ మార్కెట్లు (Stock Markets), ట్రేడింగ్ (Trading)లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మించి ముంచేస్తున్నారు.
తాజాగా, భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో సైబర్ నేరగాడు (Cyber Criminal) ఘరానా మోసానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఇల్లెందు (Illendu) మండలానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగినికి సైబర్ నేరగాడు ఫోన్ చేశారు. తమ వద్ద ట్రేడింగ్ (Trading)లో పెట్టుబడి పెడితే.. అధిక లాభాలు వస్తాయని మాయ మాటలు చెప్పి నమ్మించాడు. మొదట లాభాలు చూపించి.. అనంతరం ఆమె అకౌంట్ నుంచి ఏకంగా రూ.16.6 లక్షలు కాజేశాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన సదరు మహిళ.. తనకు న్యాయం చేయాలని సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.