- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Crime : చిట్టి డబ్బులు ఇవ్వడం లేదని హత్య..
దిశ,వనపర్తి : చిట్టి డబ్బులు ఇవ్వడం లేదని గొంతు నులిమి హత్య చేసిన సంఘటన వనపర్తి మండలం చిట్యాల గ్రామంలో చోటుచేసుకుంది.గురువారం చిట్యాల గ్రామస్తులు అనుమానస్పదంగా ఓ వ్యక్తి మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చారు.వనపర్తి టౌన్ ఎస్సై హరిప్రసాద్ తన సిబ్బందితో ఘటన స్థలం చేరుకుని పరిశీంచారు.టౌన్ ఎస్సై హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు వనపర్తి పట్టణానికి చెందిన రాములు (37)తండ్రి లక్ష్మయ్య వృత్తి భవన కార్మికుడుగా గుర్తించామన్నారు.
నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన రాములు మృతదేహం ను బంధువులు గుర్తించారన్నారు.మృతదేహం ను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ కృష్ణయ్య నేతృత్వం టౌన్ ఎస్సై హరి ప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు.సీసీ కెమెరాల ఆధారంగా అంకురు గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ని అదుపులోకి తీసుకొని విచారించగా,మృతుడు రాములు తనకు చిట్టి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో, నిందితుడు శ్రీనివాస్ రెడ్డి మృతుడు రాములును చిట్యాల గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి,చిట్టి డబ్బులు ఇవ్వాలి అడిగిన తనపై దాడికి యత్నించగా గొంతు నులిమి చంపానని శ్రీనివాస్ రెడ్డి నేరం ఒప్పుకున్నాడు. శుక్రవారం సాయంత్రం డీఎస్పీ వెంకటేశ్వరరావు ముందు ప్రవేశపెట్టిన జ్యూడిషల్ రిమాండ్ కు తరలించామని టౌన్ ఎస్సై హరి ప్రసాద్ తెలిపారు.