పండుగకు వచ్చి పరలోకాలకు..

by Aamani |
పండుగకు వచ్చి పరలోకాలకు..
X

దిశ, వేములవాడ టౌన్: పండుగ కోసం సొంత ఊరికి వచ్చిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రూరల్ మండలం, బొల్లారం వద్ద బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులు హన్మాజీపేట గ్రామానికి చెందిన దిలీప్, అనిల్ గా గుర్తించారు. హైదరాబాద్ లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న యువకులు ఇద్దరు ఇటీవల పండుగ కోసం సొంత ఊరికి వచ్చారు.పండుగ కోసం వచ్చిన యువకులు ప్రాణాలు వదలడం తో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed