చైన్ స్నాచింగ్..నిందితుల అరెస్ట్

by Aamani |
చైన్ స్నాచింగ్..నిందితుల అరెస్ట్
X

దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇటీవల జరిగిన మూడు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు సోమవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ వివరాలను వెల్లడించారు. సోమవారం అశ్వారావుపేట మండల కేంద్రం జంగారెడ్డిగూడెం రోడ్డు సాయిబాబా గుడి వద్ద సీఐ కరుణాకర్, ఎస్సై యాయతి రాజు, సాయి కిషోర్ రెడ్డి, విజయసింహారెడ్డి లు సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా, వెంబడించి పట్టుకున్నారు. విచారణలో ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన బచ్చు సతీష్.. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామానికి చెందిన ఆరెంపుల ధర్మరాజు లు గుర్తించారు.

వీరు పలు కేసులలో నిందితులుగా ఉన్నారు. ఫిబ్రవరి 15న దమ్మపేట మండలం మందలపల్లి సమీపంలోని ఓ ధాబాలోని మహిళ మెడలో బంగారపు నాను తాడును చూసి దొంగలించాలనుకున్నారు. రాత్రి వాళ్లు పడుకున్న తర్వాత వచ్చిన ఇద్దరు.. వాళ్ళ పై దాడి చేసి మూడు తులాల బరువు గల తాడుని లాక్కుని పారిపోయారు. ఆ తర్వాత దమ్మపేట మండలం లో ఎస్బిఐ బ్యాంక్ నుంచి నగదు విత్ డ్రా చేసుకుని వస్తున్న వ్యక్తిని నుంచి రూ.40 వేలు ఉన్న బ్యాగుని దొంగలించారు. అదేవిధంగా సెప్టెంబర్ 10న అశ్వారావుపేట మండలం నారంవారి గూడెం సెంటర్లో ఓ షాపు నిర్వాహకురాలు మెడలోని బంగారపు నాను తాడు పై కన్నేశారు.

అర్ధరాత్రి రెండు గంటలకు బాత్రూం కి వెళ్లేందుకు.. ఇంటి తలుపు తీసి బయటకు వచ్చిన భర్తపై కర్రతో దాడి చేసి.. మహిళ మెడలో నాను తాడును లాక్కునేందుకు ప్రయత్నించారు. మహిళా గట్టిగా పట్టుకోవడంతో తెగిపోయిన పోయిన 18 గ్రాముల సగం ముక్క గొలుసుతో ఉడాయించారు. పట్టుబడిన నిందితుల వద్ద నుంచి 48 గ్రాముల బంగారం రికవరీ చేసి.. దాడి చేసేందుకు వాడిన కర్ర, మంకీ క్యాప్ లు, హ్యాండ్ గ్లౌజులు, ఓ ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీన పరచుకొని నిందితులను రిమాండ్ కు తరలించారు.

Advertisement

Next Story