- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్లక్ష్యమే తన నిండు ప్రాణం తీసింది
దిశ, గజ్వేల్ రూరల్ : అతని నిర్లక్ష్యమే విద్యుత్ షాక్ రూపంలో తన నిండు ప్రాణం తీసిన సంఘటన గజ్వేల్ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వరంజిత్ అనే చిరు వ్యాపారి గజ్వేల్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో రోడ్డు ప్రక్కన పానీ పూరీ బండి నడుపుతూ కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే పక్కనే ఉన్న మెడికల్ షాప్ లో నుండి తన పానీ పూరీ బండికి విద్యుత్ సరఫరా కనెక్షన్ తీసుకుని బల్బ్ వెలిగించుకున్నాడు. తన బండి సమీపంలో పానీ పూరీకి సంబంధించిన పనిమూట్లను నీళ్లతో శుభ్రపర్చుకోగా నేల మొత్తం తడిసిపోయింది. పానీ పూరీ బండికి వస్తున్న విద్యుత్ సరఫరాను ఆపివేయకుండానే తడిసిన నేలపై నిలబడి తడిసిన చేతులతోనే ప్లగ్ తీయడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గజ్వేల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.