- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Odisha Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. 10 మంది ప్రయాణికులు స్పాట్ డెడ్
దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. గంజాం జిల్లా దిగపహండి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు బస్సులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బెర్హంపూర్ నుంచి అర్ధరాత్రి ఒంటిగంటకు బయలుదేరిన ప్రయివేట్ బస్సు, ఎదురుగా వస్తున్న ఓఎస్‌ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు సమాచారం.
స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.