- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యక్తి దారుణ హత్య..
దిశ, దుండిగల్: బౌరంపేట సతీష్ సొసైటీ లోని శివ టైల్స్ కంపెనీలో పనిచేసే ఓ వ్యక్తి అర్ధరాత్రి హత్యకు గురైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, కుషినగర్ తాలూకా, పాజినగర్ కు చెందిన మనోజ్ చౌహన్ (35), లక్ష్మీ చౌహన్ భార్యా భర్తలు. 6 సంవత్సరాల క్రితం పఠాన్ చెరువులో పనిచేస్తున్న సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి మహేష్ 3 సంవత్సరాల కుమారుడు. గత సంవత్సర కాలంగా దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట సతీష్ కో ఆపరేటివ్ సొసైటీలోని శివ టైల్స్ కంపెనీలో భార్యా భర్తలు దినసరి కూలీలుగా పనిచేస్తున్నట్లు తెలిసింది.
అదే ప్రాంతంలో ఓ అద్దె గదిలో నివాసం ఉంటున్నారు. భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. శనివారం రాత్రి కూడా అతని భార్య ఇతరులతో ఫోన్ మాట్లాడుతున్న విషయాన్ని గమనించి మందలించడంతో మద్యం మత్తులో భార్యభర్తలు గొడవ పడినట్లు తెలిసింది. ఆదివారం తెల్లవారుజామున హత్య గురయ్యాడు. అతని తలపై బలమైన గాయాలు అయ్యాయి. అతను పెట్టే బాధలు భరించలేక మద్యం మత్తులో అతని భార్యే హత్య చేసిందా.. లేక.. ఎవరైనా హత్య చేశారా తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.