మైనర్ బాలిక పై అధికారపార్టీ లీడర్ అత్యాచారం..

by Sumithra |
మైనర్ బాలిక పై అధికారపార్టీ లీడర్ అత్యాచారం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బోధన్ లో దారుణం జరిగింది. బీఆర్ఎస్ యూత్ లీడర్ ఒకరు మైనర్ బాలికను అత్యాచారం చేశారు. ఈ సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. తల్లితో ఉంటున్న 13 ఏళ్ల బాలిక పై రవీంధర్ అనే యువకుడు మంగళవారం రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రవీందర్ బీఆర్ఎస్ పార్టీ బోధన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణకు స్వయాన తమ్ముడు. కాగా బుధవారం ఉదయం కౌన్సిలర్ బాలిక ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేయవద్దని బెదిరించినట్లు సమాచారం.

బోధన్ పోలీసులు కేసునమోదు చేసి కౌన్సిలర్ తమ్ముడు రవీందర్ ను అరెస్టు చేశారు. విషయం తెలిసిన బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ బాలిక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రతి నెల ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. బాలిక పై అఘాయిత్యానికి ఒడిగట్టిన రవీందర్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఫోక్సో చట్టం కింద ఉరి తీయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణను, అతని తమ్మున్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇద్దరి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story