- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం
దిశ,సత్తుపల్లి : భార్య కాపురానికి రావడం లేదని బ్లేడ్ తో భర్త గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన సత్తుపల్లి మండలం బేతుపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఎస్కే. ఇమ్రాన్ కు సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామానికి చెందిన యువతితో వివాహం జరగగా గత కొంత కాలం నుంచి భార్య పుట్టింట్లో ఉంటూ కాపురానికి రావడం లేదు.
దాంతో బుధవారం అత్తగారి ఇంటికెళ్లిన ఇమ్రాన్ అక్కడ గొడవపడి తన వెంట తెచ్చుకున్న బ్లేడ్ తో గొంతు కోసుకున్నాడు. దాంతో తీవ్ర రక్తస్రావం కాగా వారి కుటుంబ సభ్యులు వెంటనే సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.