అంతర్జాతీయ డ్రగ్​ పెడ్లర్ల అరెస్ట్..​

by Vinod kumar |
అంతర్జాతీయ డ్రగ్​ పెడ్లర్ల అరెస్ట్..​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: తెలంగాణ యాంటీ నార్కొటిక్​బ్యూరో, నార్కొ ఎన్ఫోర్స్ మెంట్​విభాగం సిబ్బంది, బంజారాహిల్స్​పోలీసులు కలిసి అంతర్జాతీయ డ్రగ్​పెడ్లర్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి కోటి రూపాయల విలువ చేసే కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ తోపాటు అయిదు మొబైల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​పోలీస్​కమిషనర్​సీ.వీ. ఆనంద్​శుక్రవారం పోలీస్​కమాండ్​కంట్రోల్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నైజీరియా దేశానికి చెందిన అగ్బోవో మ్యాక్స్​వెల్​నబుసి 2011లో మెడికల్​వీసాపై భారత్​వచ్చాడు. మొదట ముంబయికి చేరుకున్న మ్యాక్స్​వెల్​కొన్నాళ్లు అక్కడే ఉన్నాడు. తేలికగా డబ్బు సంపాదించే లక్ష్యంతో ముంబయిలో డ్రగ్స్​అమ్మటం ప్రారంభించిన అగ్బోవో కొన్నాళ్ల తరువాత పోలీసులు పట్టుకుంటారన్న భయంతో బెంగళూరుకు మకాం మార్చాడు.


ఆ తరువాత క్వెకు ఎస్సుమన్​క్వామే పేర నైజీరియా దేశం నుంచి జారీ అయినట్టుగా నకిలీ పాస్​పోర్ట్, వీసా తయారు చేసుకున్నాడు. వీటిని సమర్పించటం ద్వారా బెంగళూరులో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. దాంతోపాటు ఇంటర్​నెట్​కనెక్షన్​ను కూడా సమకూర్చుకున్నాడు. ఆ తరువాత నైజీరియాకే చెందిన మజీతో కలిసి బెంగళూరులో కూడా డ్రగ్స్​దందా మొదలుపెట్టాడు. ఈ క్రమంలో కాలేజీలు, యూనివర్సిటీలకు దగ్గరగా ఉన్న అచ్యుతాపురానికి మకాం మార్చి విద్యార్థినీ, విద్యార్థులకు డ్రగ్స్​అమ్మటం ప్రారంభించాడు. పోలీసులకు పట్టుబడకుండా ఉండటానికి వర్చువల్​ఫోన్​నెంబర్లను ఉపయోగించేవాడు.

స్నేహితుడైన మజీ పేరును ఎవ్లిన్​యోరెంకియావాగా మార్చి నేషనల్​బ్యాంక్​లో అకౌంట్​కూడా తెరిపించాడు. వీరి దందా కొనసాగుతుండగానే నైజీరియా నుంచి స్టూడెంట్, బిజినెస్​వీసాల మీద బెంగళూరుకు వచ్చిన ఒకెకె చిగొజీ బ్లెస్సింగ్, ఐకెమ్​ఆస్టిన్​ఒబాకాతో అగ్బోవోకు పరిచయం ఏర్పడింది. కమీషన్​ఆశ చూపించిన అగ్బోవో చిగొజీ, ఆస్టిన్​లను కూడా డ్రగ్స్​దందాలోకి దింపాడు.

సడన్ ​డెలివరీ..

డార్క్​నెట్లో నేషనల్​బ్యాంక్​లో ప్రారంభించిన అకౌంట్​వివరాలను అప్​లోడ్​చేసిన అగ్బోవో ఆన్ లైన్​ద్వారానే డ్రగ్స్​విక్రయాలు జరిపేవాడు. బ్యాంక్​ఖాతాలో ఎవరైనా డబ్బు జమ చేయగానే ఫలానా చోట మీకు కావాల్సిన సరుకు ప్యాకెట్​ఉంటుందని మెయిల్​పంపించేవాడు. చెప్పిన రోజున, చెప్పిన సమయానికి డ్రగ్స్​తో ఉన్న కవర్​పెట్టి వెళ్లేవాడు. కొన్నిసార్లు తాను డ్రగ్స్​పెట్టిన చోటు లొకేషన్​షేర్​చేసేవాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్​శ్రీనగర్​కాలనీకి చెందిన సాయి అకేశ్, మణికొండ అలకాపురి వాస్తవ్యుడు తుమ్మ భానుతేజ రెడ్డి, కేరళ రాష్ర్టం త్రిస్సూర్​నివాసి సంజయ్​సునల్​కుమార్ తో అతనికి పరిచయాలు ఏర్పడ్డాయి.

అగ్బోవో నుంచి డ్రగ్స్​కొంటున్న సంజయ్​సునీల్​కుమార్, భానుతేజ రెడ్డిలను కొంతకాలం క్రితం అరెస్టు చేసిన బంజారాహిల్స్​పోలీసులు వారిని విచారించి మొత్తం గ్యాంగ్​వివరాలు సేకరించారు. అనంతరం యాంటీ నార్కొటిక్​బ్యూరో, నార్కొటిక్​ఎన్ఫోర్స్ మెంట్ విభాగాలకు చెందిన అధికారులు రంగంలోకి దిగి మజీ మినహా మిగితా నిందితులందరినీ అరెస్టు చేశారు. అరెస్టయిన నైజీరియన్లను వారి దేశానికి డిపోట్​చేయటానికి చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్​ఆనంద్​తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed