- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోసగాళ్ల ఉచ్చులో మరో మహిళ.. నకిలీ బంగారం కొనుగోలు
దిశ, తుంగతుర్తి: దురాశ దుఃఖానికి నెలవు.. అంటే ఇదేనేమో..! మోసగాళ్లు అంటగట్టిన నకిలీ బంగారం కడ్డీని అసలు గా భావించి అతి తక్కువ ధరకే కొనుగోలు చేసి చివరికి నిలువునా మోసపోయిన మరో మహిళ సంఘటన ఇది. సంఘటన ఇటీవలే జరిగినప్పటికీ శనివారం ఆ నోట ఈ నోట వెలుగులోకి రావడంతో చివరికి పోలీస్ స్టేషన్ కు చేరింది. దీంతో బాధితురాలు తాను మోసపోయిన విధానాన్ని వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామానికి చెందిన తూము లక్ష్మి గ్రామంలోనే కిరాణా దుకాణం నిర్వహిస్తోంది.
ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పురుషులు, ఒక మహిళ గ్రామానికి చేరుకొని తాము సుతారి పనులు చేస్తున్నామని చెప్పుకుంటూ కిరాణం దుకాణం పక్కనే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ మేరకు ఆ గుర్తు తెలియని వ్యక్తులు ప్రతిరోజూ కిరాణా దుకాణానికి వెళ్లి సరుకులు కొనుగోలు చేస్తూ.. యజమాని లక్ష్మితో నమ్మకాన్ని పెంచుకున్నారు. కాగా గత నెల మూడో వారంలో తమ అక్క కూతురుకు ఆరోగ్యం బాగా లేదని ఈ మేరకు డబ్బులు అవసరం ఉన్నాయంటూ.. తమ వద్ద ఉన్న చిన్న ముక్క బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడం లేదా కొనుగోలు చేయాలని దుకాణ యజమాని లక్ష్మీని కోరారు.
ఈ మేరకు సమ్మతించిన ఆమె.. వారు ఇచ్చిన బంగారాన్ని తనిఖీ చేయించుకోగ అసలిగా తేలింది. అనంతరం నాలుగు ముద్దలు కలిగిన పావుకిలో బంగారాన్ని మళ్లీ తీసుకొచ్చి కొనుగోలు చేయాలని లక్ష్మీని కోరడంతో సమ్మతించింది. మొదట్లో ఇచ్చిన బంగారం ఒరిజినల్‌గా తేలిన విషయాన్ని గ్రహించిన లక్ష్మి 4 ముద్దల బంగారం కూడా ఒరిజినల్‌గానే ఉంటుందని భావించింది. ఈ మేరకు దాన్ని తనిఖీ చేయించుకోకుండానే రూ.1.80 వారికి ఇచ్చింది.
అనంతరం రెండు మూడు రోజుల తర్వాత నాలుగు ముద్దుల బంగారాన్ని తనిఖీ చేయించుకోగా నకిలీ గా తేలింది. సదరు గుర్తు తెలియని వ్యక్తులు కూడా అద్దె ఇంటికి తాళాలు వేసి పరారయ్యారు. దీంతో మోసపోయానని భావించిన లక్ష్మి విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవరికి చెప్పుకోలేదు. చివరికి విషయం బయటకు పొక్కడంతో పోలీసులకు చేసింది. ఈ మేరకు కేసు నమోదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డానియల్ విలేకరులకు తెలిపారు.
మద్దిరాల నుంచి తుంగతుర్తికి మోసగాళ్లకు బాట
తుంగతుర్తి నియోజకవర్గంలోని మద్దిరాల మండల కేంద్రంలో గత నెల 22న ఇలాంటి సంఘటనే జరిగింది. ఇక్కడ కూడా కిరాణం దుకాణం నడుపుతున్న మహిళను ఇదే తరహాలో నమ్మించి మోసగించి పరారయ్యారు. అనంతరం తమ నాటకానికి తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో తెర లేపారు.ఇదే విషయంపై పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు.