రాష్ట్రంలో దారుణం.. ఇంటర్ విద్యార్థినిని హత్య చేసిన ఉన్మాది

by Gantepaka Srikanth |
రాష్ట్రంలో దారుణం.. ఇంటర్ విద్యార్థినిని హత్య చేసిన ఉన్మాది
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌ విద్యార్థి(inter student)ని ఓ ఉన్మాది హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. సన్నీ అనే యువకుడు గత కొంతకాలంగా అశ్విని అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. యువతి తరచూ నిరాకరిస్తుండటంతో కోపంతో ఊగిపోయిన సదరు ఉన్మాది.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి విద్యార్థిని అశ్విని నోట్లో పురుగుల మందు పోసి హత్య చేశాడు. కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం నగరూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే అశ్విని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story