అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి..

by Sumithra |
అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి..
X

దిశ, కోరుట్ల టౌన్ : కోరుట్ల పట్టణంలోని రాంనగర్ కాలనిలో కొత్తపేట గణేష్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేట గణేష్ గత కొంత కాలం క్రితం గల్ఫ్ దేశం నుండి వచ్చి స్థానికంగానే ఉండి పనులు చేసుకుంటున్నాడు. గణేష్ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అక్కడున్న వారు ఇంటి తలుపులు తీసి చూసేసరికి గణేష్ మృతి చెంది ఉన్నాడు.

దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేస్తున్నారు. దుర్వాసన రావడంతో గణేష్ నాలుగు రోజులు కిందటే మరణించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఇంట్లో కుటుంబ కలహాలు ఏర్పడడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు భావిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Advertisement

Next Story