- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్..
దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో యువకుడు స్పాట్ డెడ్ అయిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన సైదుల మహేష్ (28) శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై కోదాడ నుంచి జాజిరెడ్డిగూడెం వస్తున్నాడు. మండలంలోని వేల్పుచర్ల గ్రామం వద్దగల మూలమలుపులో గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీ కొట్టడంతో, అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు కోదాడలోని ఒక గురుకుల పాఠశాలలో పీఈటీగా కొనసాగుతున్నాడు.
శివరాత్రి సందర్భంగా వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో సొంత గ్రామానికి వస్తుండగా ఘటన జరిగింది. నెల రోజుల క్రితమే మృతుని తండ్రి మరణించడం గమనార్హం. రెండు నెలల వ్యవధిలో తండ్రీకొడుకులు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం తుంగతుర్తి లోని ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.