తల్లి మందలించినందుకు యువకుడు ఆత్మహత్య

by Sridhar Babu |
తల్లి మందలించినందుకు యువకుడు ఆత్మహత్య
X

దిశ, గోదావరిఖని : గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన ముక్క రోహక్ (16) తల్లి మందలించిందని సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిఖని పోలీసుల కథనం ప్రకారం NTPC సచ్ దేవ్ కాలేజీలో రోహక్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రోహక్ కాలేజీకి సరిగా వెళ్లక, ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ రాయలేదు. ఎప్పుడూ బయట తిరుగుతూ రాత్రికి ఇంటికి వచ్చేవాడు. దాంతో అతని తల్లి మందలించింది. ఇలా చేస్తే నీ కెరీర్ ఏం కావాలి, పద్ధతి మార్చుకోవాలని సూచించింది. దాంతో మనస్థాపం చెంది ఉరి వేసుకున్నాడు. జీవితం పైన విరక్తి చెంది పెంట్ హౌస్ ఇనుప రోడ్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు SI రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story