- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజస్థాన్లో ఘోరం.. నలుగురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ లో ఘోరం జరిగింది. నలుగురు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. వివరాల్లోకి వెళ్తే..రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలోని బనియావాస్ గ్రామానికి చెందిన ఊర్మిళ (27), జెతారామ్ అనే దంపతులకు నలుగురు పిల్లలు భావన (8), విక్రమ్ (5), విమల (3), మనీషా (2) అనే నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే భార్యాభర్తలు నిత్యం గొడవపడేవారు. ఈ క్రమంలోనే శనివారం భార్యాభర్తలిద్దరూ మరోసారి గొడవపడ్డారు. భర్త పని మీద జోద్ పూర్ కు వెళ్లింది చూసిన మహిళ.. తన నలుగురు పిల్లలను బియ్యం డబ్బాలో పెట్టి మూత పెట్టింది. దీంతో వారు ఊపిరాడక చనిపోయారు.
అనంతరం ఆమె కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల వల్లే మహిళ తన పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుందని డీఎస్పీ కమలేశ్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా తల్లి, పిల్లల మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.