- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మృతదేహాలను ముక్కలుగా కోసి.. వ్యాపారం చేస్తున్న మహిళ..
దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తే.. మరికొంతమంది ఆన్‌లైన్ల ద్వారా ప్రజల్ని మోసం చేసి మనీ సంపాదిస్తుంటారు. ఇలా ఎన్నో రకాలుగా మనీ పోగు చేసేవారు ఉంటారు.. కానీ ఓ మహిళ మృతదేహాలతో వ్యాపారం చేస్తూ డబ్బును కూడబెట్టుతోంది. వినడానికీ వింతగా ఉన్నా ఇది నిజం. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని అర్కాన్సాస్‌కు చెందిన కాండేస్ స్కాట్ (36) అనే మహిళ సమీపంలో ఉన్న ఓ మార్చురీలో పనిచేస్తుంది. అయితే ఆమె 2021లో ఫేస్ బుక్‌లో ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. అతడితో ఆమె సీక్రెట్‌గా ఓ ఒప్పందం చేసుకుంది. మార్చురీలో ఉన్న శవాల బాడీ పార్ట్స్‌ను అమ్మేయడం ఆ మహిళ పని.
అలాగే మెడికల్ కాలేజీ నుంచి మృతదేహాల పుర్రెలు, మెదడు, దంతాలు వంటి అవయవాలను అతడికి అమ్మేసింది. దీంతో ఆమెకు సుమారు 11వేల డాలర్లకు పైగా మనీ రావడంతో తను సంతోషం తట్టుకోలేక.. అప్పటి నుంచి 9నెలల పాటు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె ఇలా చాలా రకాల పార్ట్స్‌ను అమ్మడం ప్రారంభించింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.