- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్థిక ఇబ్బందులు తాళలేక వివాహిత ఆత్మహత్య
దిశ, మానవపాడు : ఆర్థిక ఇబ్బందులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన కుర్వ దామోదర్- సరితల వివాహం 12 సంవత్సరాల క్రితం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు. అప్పటినుండి ఇప్పటివరకు అన్యోన్యంగా దామోదర్ సంపాదనతో జీవనం కొనసాగింది. గత ఏడాది నుండి దామోదర్ జీవనోపాధి కోల్పోవడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి.
తన ఇద్దరు పిల్లలను ఎలా చదివించుకోవాలో.. తన భర్తకు సంపాదన లేదని.. కుటుంబ భారం అధికం అయ్యిందని తరచు దామోదర్ భార్య సరిత చెబుతుండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. సరితకు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేకపోవడం.. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మనస్థాపానికి గురై సరిత ( 32) బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులతోనే సరిత ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు మానవపాడు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు సమాచారం.