బెడ్ రూమ్‌లో మామ, చిన్నకోడలు రొమాన్స్.. అదే సీన్‌లో అత్త, పెద్ద కోడలు ఏం చేశారంటే..?

by sudharani |   ( Updated:2022-12-15 03:14:26.0  )
బెడ్ రూమ్‌లో మామ, చిన్నకోడలు రొమాన్స్.. అదే సీన్‌లో అత్త, పెద్ద కోడలు ఏం చేశారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో రోజు రోజుకు అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. బంధాలను మరిచిపోయి అనైతిక సంబంధాలకు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది హత్యకు గురికావడంతోపాటు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ముంబయిలో జరిగింది. 55 ఏళ్ల మామతో చిన్న కోడలు అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న అత్త.. పెద్ద కోడలు సహాయంతో భర్తను హత్య చేసింది. వివరాల్లోకి వెళితే..

కోయిరానా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (55) కి నలుగురు కుమారులు. వీరిలో ఇద్దరి కొడుకులకు క్రితం వివాహమైంది. వీరంతా ఒకే ఇంట్లో ఉంటూ.. ముంబైలోని కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్నకోడలుతో మామకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అత్త, పెద్దకోడలు.. చిన్న కోడలిని పుట్టింటికి పంపించారు. దీంతో భార్య, పెద్దకోడలిపై కోపం పెంచుకున్న మామ.. వారిద్దరిపై దాడి చేశాడు. దీంతో పెద్దకోడలు మరో ఇంటికి కిరాయికి వెళ్లిపోయింది.

కాగా.. ఐదు రోజుల క్రితం చిన్న కోడలిని ఇంటికి రప్పించుకున్నాడు మామ.. శనివారం రాత్రి ఇద్దరు రాసలీలల్లో మునిగి ఉండగా అత్త,పెద్ద కోడలు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిపై దాడి చేసి హత్య చేశారు. దీంతో భయంతో పరుగులు తీసిన చిన్న కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న అతడి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చిన్న కోడలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్త, పెద్దకోడలిపై కేసు నమోదు చేశారు.

Read more:

పబ్‌లో యువకుడితో మహిళా యూట్యూబర్.. ఆ రాత్రి ఆమె వేసిన ఛార్జ్ రూ.80 లక్షలు

Advertisement

Next Story