- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అర్ధరాత్రి గుంతలో మహిళను నగ్నంగా కూర్చొమన్న మాంత్రికుడు.. ఆపై కోరిక తీర్చుకునే క్రమంలో..
దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ కొంతమంది మూఢనమ్మకాలతో జీవితాలను బలి చేసుకుంటున్నారు. దొంగ స్వామిజీలను నమ్మి డబ్బుతో పాటు, మానం కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. దొంగ బాబాను నమ్మిన ఓ మహిళ ఇంటికి వెళ్లి.. నగ్న పూజలంటూ ఆ మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు ఓ వ్యక్తి. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తిరుపతి జిల్లా రేణుగుంట మండలం కారకంబడి ప్రాంతానికి చెందిన ఓ 35 ఏళ్ల మహిళ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. అయితే ఆ అనారోగ్యానికి సరైన కారణం తెలియక పోవడంతో తనకు ఎవరో చేతబడి చేశారని భావించింది. దీంతో దూరపు చుట్టం సలహా మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని బహదూర్ పేటలో మసారపు సుబ్బయ్య అనే మాంత్రికుడి వద్దకు వెళ్లింది. అక్కడికి వెళ్లగానే ఆ మాంత్రికుడు నీపై కొందరు వ్యక్తులు చేతబడి చేయించారు అందుకే నీ ఆరోగ్యం దెబ్బతిన్నది అని వివరించాడు. దీనికి పరిష్కారం చేయాలంటే రూ.20 వేలు ఖర్చు అవుతుందని చెప్పాడు. అది నమ్మిన మహిళ ఆ మాంత్రికుడికి అడ్వాన్స్‌గా రూ.7500 చెల్లించింది. ఈ క్రమంలోనే మాంత్రికుడు సుబ్బయ్య ఆ మహిళ ఇంటికి చేరుకున్నాడు.
రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో గంట తవ్వి, ముగ్గులు గీశాడు. అనంతరం మహిళను నగ్నంగా ఆ గుంతలో కూర్చోమన్నాడు. దానికి ఆ మహిళ నిరాకరించింది. దీంతో రెచ్చిపోయిన దొంగ బాబా మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగుపరుగున అటు వైపు వచ్చారు. అది గమనించిన మాంత్రికుడు కారులో పరారయ్యాడు. దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా దొంగ మాంత్రికుడు సుబ్బయ్యను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. దొంగ బాబా నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.